ఆదివారం 24 జనవరి 2021
Crime - Dec 22, 2020 , 07:10:48

చంచల్‌గూడలో ప్రైవేటు బస్సులో మంటలు

చంచల్‌గూడలో ప్రైవేటు బస్సులో మంటలు

హైదరాబాద్‌ : నగరంలో చంచల్‌గూడలో మంగళవారం ఉదయం ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. నిలిపి ఉంచిన బస్సులు మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. గుర్తు తెలియని వ్యక్తులే తగులబెట్టి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


logo