హైదరాబాద్ : కోఠి మెడికల్ కాలేజీ సమీపంలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడున్న రెండు షాపుల్లో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో బట్టలు, చెప్పుల దుకాణం పూర్తిగా దగ్ధమయ్యాయి.
ఉదయం 6 గంటల సమయంలో చెప్పుల దుకాణం నుంచి దట్టమైన పొగలు రావడంతో పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. అక్కడ అంటుకున్న మంటలు పక్కనే ఉన్న బట్టల దుకాణానికి వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.