శనివారం 04 జూలై 2020
Crime - Jun 03, 2020 , 06:30:44

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని తుగ్లకాబాద్‌ మురికివాడలో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. వాల్మికీ బస్తీలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు.. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. ఈ సందర్భంగా డివిజనల్‌ ఫైర్‌ ఆఫీసర్‌ ఎస్‌కే దువా మాట్లాడుతూ.. వాల్మికీ బస్తీలో అగ్నిప్రమాదం సంభవించినట్లు బుధవారం తెల్లవారుజామున 1:31 గంటలకు సమాచారం అందిందని తెలిపారు. తక్షణమే 20 ఫైరింజన్లు అక్కడికి వెళ్లి మంటలను అదుపు చేశాయన్నారు. మంటలను ఆర్పేందుకు సుమారు 2 గంటల పాటు శ్రమించాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.  


logo