ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Crime - Jan 23, 2021 , 13:10:10

ప్లాస్టిక్‌ గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం

ప్లాస్టిక్‌ గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం

పాట్నా : బిహార్‌ రాజధాని పాట్నాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీదర్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ప్లాస్టిక్‌ గిడ్డంగిలో శనివారం ఉదయం భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దాదాపు కిలో మీటర్‌ దూరం వరకు కనిపించాయి. అదే ప్రాంతంలో జన సాంద్రత ఎక్కువగా ఉండడం, దగ్గరలో పెట్రోల్‌ బంకు ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురై అక్కడి నుంచి పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. పాట్నా, హాజీపూర్, జెహానాబాద్, బీహార్ షరీఫ్, చప్రా తదితర అన్ని అగ్నిమాపక కేంద్రాల 20పైగా ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి తరలించి, మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం అగ్నిమాపకశాఖ అధికారి శోభా అహోత్కర్‌, అగ్నిమాపక శాఖ డీజీఐ పంకజ్ సిన్హా, పాట్నా సిటీ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ అజయ్ కుమార్ శర్మతో సహా పలువురు అధికారులు పరిస్థితిని సమీక్షించారు. అయితే ప్లాస్టిక్‌ గోడన్‌లో చెలరేగిన మంటలతో పక్కనే ఉన్న దుకాణాలకు కూడా నష్టం వాటిల్లింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని అధికారులు పేర్కొన్నారు. అయితే గత కొద్ది రోజుల కిందట ఇదే స్క్రాప్‌ గోడౌన్‌ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది.

VIDEOS

logo