రంగారెడ్డి : జిల్లా పరిధిలోని హిమాయత్ సాగర్లో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సినిమా షూటింగ్కు సంబంధించిన సామాగ్రి పూర్తిగా కాలిపోయినట్లు పోలీసులు తెలిపారు. మంటలను రాజేంద్రనగర్ ఫైర్ సిబ్బంది అదుపు చేసింది. అగ్నిప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.