మంగళవారం 19 జనవరి 2021
Crime - Dec 18, 2020 , 17:21:20

డాంబర్‌ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

డాంబర్‌ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

నిజామాబాద్‌ : జిల్లాలోని ఇందల్వాయి మండలం మాక్లూర్‌ తండా శివారులో గల డాంబర్‌ ప్లాంట్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పీఎస్‌కే కంపెనీకి చెందిన ప్లాంట్‌లో 12 గంటల ప్రాంతంలో ప్లాంట్‌లో లోపం తలెత్తడంతో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. కంపెనీలో పని చేస్తున్న వారు ఎస్సై శివప్రసాద్‌రెడ్డికి తెలుపగా ఆయన అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 

ఫైర్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలార్పేందుకు గంట పాటు శ్రమించాల్సి వచ్చింది. సుమారు రూ.15 లక్షల వరకు నష్టం వాటిల్లిందని కంపెనీ ఇన్‌చార్జి రమేశ్‌ తెలిపారు. కంపెనీకి చెందిన సాహెబ్‌ అనే వ్యక్తికి గాయాలు కాగా నిజామాబాద్‌ జిల్లా దవాఖానకు తరలించారు.