సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Aug 19, 2020 , 14:23:01

జ్యువెల్లరీ దుకాణానికి నిప్పు.. ఓనర్‌ మృతి

జ్యువెల్లరీ దుకాణానికి నిప్పు.. ఓనర్‌ మృతి

ఫిరోజాబాద్ : ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ర్టం ఫిరోజాబాద్‌లో కుటుంబ కలహాలు ఓ వ్యక్తి ప్రాణాల మీదికి తెచ్చాయి. మంగళవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు రాకేశ్‌వర్మకు చెందిన జ్యువెల్లరీ దుకాణంలోకి దూరి ఆయనపై పేలుడు పదార్థాలు విసిరి మంట పెట్టి పరారయ్యారు. మంటలు చెలరేగడంతో దుకాణంలోని సిబ్బందితో పాటు, కొనుగోలుదారులు బయటికి పరుగెత్తారు. ఈ మంటల్లో ఓనర్‌ రాకేశ్‌వర్మకు తీవ్ర గాయాలు కాగా ఆయన్ను ఆగ్రాలోని దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఇద్దరు వ్యక్తులు తీవ్ర దుర్భాషలాడుతూ దుకాణంలోకి వచ్చి రాకేశ్‌ వర్మకు నిప్పటించినట్లు సమాచారం. కుటుంబ కలహాల నేపథ్యంలోనే వారు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని, కేసు నమోదు చేసుకొని వారి కోసం వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు. బాధితుడు మంటల్లో కాలుతూ పరిగెత్తే నాలుగు సెకన్ల నిడివి గల వీడియో సీసీకెమెలో రికార్డు అయ్యిందని పోలీసులు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo