మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Jul 13, 2020 , 13:34:36

ఢిల్లీలోని మొహల్లా క్లీనిక్‌లో అగ్నిప్రమాదం.. వ్యక్తి మృతి

ఢిల్లీలోని మొహల్లా క్లీనిక్‌లో అగ్నిప్రమాదం.. వ్యక్తి మృతి

న్యూ ఢిల్లీ : ఢిల్లీలోని దర్యాగంజ్ ప్రాంతంలో గల  మొహల్లా క్లినిక్‌లో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం సంభివించింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా స్వల్పంగా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. ఆదివారం రాత్రి మొహల్లా క్లీనిక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు గమనించి ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది ఫైర్‌ ఇంజిన్‌లతో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. మంటలు చేలరేగినప్పుడు మోహల్లా క్లీనిక్‌ ఖాళీగా ఉంది. ఓ వ్యక్తి మరణించగా అతడు ఎవరు.. రాత్రి సమయంలో ఆ వ్యక్తి అక్కడికి ఎందుకు వచ్చాడో? తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాదం సంభవించడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo