శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Sep 12, 2020 , 21:03:28

కిరాణషాపులో చోరీకి వెళ్లిన దొంగ సజీవదహనం

కిరాణషాపులో చోరీకి వెళ్లిన దొంగ సజీవదహనం

మెదక్‌: ఓ కిరాణషాపులో చోరీకి వెళ్లిన దొంగ సజీవదహనం అయిన సంఘటన మెదక్‌ జిల్లాలో చోటుచేసుకుంది.  చోరీకి వెళ్లిన దొంగ షాపులో చీకటిగా ఉండడంతో అగ్గిపుల్ల వెలిగించాడు.  ప్రమాదవశాత్తు పెట్రోల్‌, శానిటైజర్‌ బాటిల్స్‌పై  మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడటంతో షాపులోనే దొంగ అగ్నికి ఆహుతై మృతిచెందాడు.  టేక్మాల్‌ మండలం పాల్వంచలో ఈ ఘటన జరిగింది.  యజమాని దుకాణం తెరవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. logo