ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Crime - Jan 20, 2021 , 06:36:26

లారీలో మంటలు.. డ్రైవర్ సజీవ దహనం

లారీలో మంటలు.. డ్రైవర్ సజీవ దహనం

నిజామాబాద్: పట్టణంలోని  6వ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లారీ క్యాబిన్‌ దగ్ధమైంది. ఈ ప్రమాదంలో క్యాబిన్‌లో నిద్రిస్తున్న ఓ వ్యక్తి సజీవదహనం అయ్యాడు. బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కారణంగానే లారీలో మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సజీవ దహనమైన వ్యక్తి లారీ డ్రైవరా లేదా యజమానా అనే విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

VIDEOS

logo