హైదరాబాద్: నగరంలోని భారీ ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం బన్సీలాల్‌పేట్ చౌరస్తాలో ఉన్న జబ్బార్ కాంప్లెక్స్‌లోని ఓ చెప్పుల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో షాపులో ఉన్న సరుకు అంతా కాలి బూడిదయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..