వరంగల్: జిల్లాలోని పరకాలలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణంలోని శ్రీనివాస మెటల్ షాప్ గోదాంలో మంగళవారం తెల్లవారుజామున పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో గాదాంలో ఉన్న సామాగ్రి కాలి బూడిదయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సహకారంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..