ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jul 19, 2020 , 23:58:07

మహిళా పోలీసుకు తప్పని లైంగిక వేధింపులు

మహిళా పోలీసుకు తప్పని లైంగిక వేధింపులు

దిండోరీ (మధ్యప్రదేశ్‌) : మహిళా పోలీసుపై లైంగిక వేధింపుల కేసులో షాపురా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి హేమంత్ బార్వేపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హేమంత్ బార్వే శనివారం సాయంత్రం మహిళా పోలీసు ఇంటికి వెళ్లి తనను వివాహం చేసుకోవాలని ఆమెను బలవంతం చేశాడు. ఈ సమయంలో ఆమె తల్లి (దివ్యాంగురాలు) కూడా ఇంట్లోనే ఉంది. మహిళా పోలీసు అరవడంతో బార్వే పారిపోయాడు. బాధితురాలు అదేరోజు అర్ధరాత్రి దిందోరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి ఇంటిని సీజ్‌ చేసి అతడిని పట్టుకునేందుకు యత్నిస్తున్నామని ఎస్పీ సంజయ్‌సింగ్‌ తెలిపారు.


logo