శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Sep 16, 2020 , 12:19:43

శ్రావణి ఆత్మహత్య కేసులో..సినీ నిర్మాత అశోక్‌రెడ్డి అరెస్ట్

శ్రావణి ఆత్మహత్య కేసులో..సినీ నిర్మాత అశోక్‌రెడ్డి అరెస్ట్

హైదరాబాద్ : బుల్లితెర నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో పరారీలో ఉన్న సినీ నిర్మాత అశోక్‌రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. శ్రావణి ఆత్మహత్యకు ప్రేరేపించిన ముగ్గురు నిందితుల్లో దేవరాజ్‌, సాయికృష్ణారెడ్డిని ఇదివరకే అరెస్టు చేశారు. ఏ2గా ఉన్న అశోక్‌రెడ్డికి పోలీసులు ముందుగానే నోటీసులు ఇచ్చారు. సోమవారం ఎస్సార్‌నగర్‌ ఠాణాకు వస్తానని చెప్పి చివరి నిమిషంలో మస్కా కొట్టాడు. సెల్‌ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్లాడు. సినీరంగంలో అవకాశాలు ఇప్పిస్తానంటూ ఆశ చూపి శ్రావణితో సంబంధం ఏర్పరచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు.

ఆమె దేవరాజ్‌కు దగ్గర కావటాన్ని అశోక్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయాడు. సాయికృష్ణ ద్వారా ఒత్తిడి తెచ్చి ఇద్దరూ విడిపోయేందుకు సహకరించినట్టు తెలుస్తోంది. సెప్టెంబరు 7న అమీర్‌పేట హోటల్‌ వద్ద శ్రావణి, దేవరాజ్‌తో గొడవ అనంతరం సాయికృష్ణ ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు.  అప్పటికే అక్కడ ఉన్న అశోక్‌రెడ్డి అందరూ కలిసి శ్రావణిని శారీరకంగా హింసించారు.  ఆత్మహత్యకు ముందురోజు జరిగిన వ్యవహారంలో అశోక్‌రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసులు ఆధారాలు సేకరించారు.


logo