శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Aug 20, 2020 , 19:20:18

ఆగ్రాలో డాక్టర్ దారుణహత్య.. నిందితుడి అరెస్ట్

ఆగ్రాలో డాక్టర్ దారుణహత్య.. నిందితుడి అరెస్ట్

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో వైద్యురాలు దారుణహత్యకు గురైంది. ఆమె స్నేహితుడైన మరో వైద్యుడే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హంతకుడు తన నేరాన్ని అంగీకరించడంతో అతడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఢిల్లీలోని శివపురి కాలనీకి చెందిన డాక్టర్ యోగిత.. మొరాదాబాద్ లోని తీర్థంకర్ మెడికల్ కాలేజీలో 2009 లో ఎంబీబీఎస్ చదివింది. మూడేండ్ల క్రితం ఎస్ఎస్ మెడికల్ కాలేజీలో పీజీ కోర్సులో చేరింది. ఆగ్రా థానాలోని ఎంఎం గేట్ నూరి దర్వాజాలో నివసించేది. మంగళవారం సాయంత్రం డాక్టర్ యోగితను కలిసేందుకు ఆమె స్నేహితులుడ డాక్టర్ వివేక్ జలాన్ నుంచి ఆగ్రా వచ్చాడు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగిపోయింది. వెంటతెచ్చుకున్న కత్తితో ఆమె గొంతును కోసేశాడు. ముఖం, తలపై కూడా కత్తితో పొడిచాడు. అనంతరం డౌకీ ప్రాంతంలోని బమ్రౌలి గ్రామానికి సమీపంలో ఉన్న నిర్జన ప్రదేశంలో యోగిత మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయాడు. అటుగా వెళ్లిన గ్రామస్థులకు స్పోర్ట్స్ షూస్, ఆ పక్కనే మృతదేహం పడివుండటం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆమె జేబులో లభించిన కార్డు ఆధారంగా ఆమెను డాక్టర్ యోగితగా గుర్తించి.. ఎస్ఎస్ మెడికల్ కాలేజీకి సమాచారం అందించారు.

పోలీసుల విచారణలో ఆమెతో స్నేహం చేసిన డాక్టర్ వివేక్ హత్య చేశాడని గుర్తించి ఆయనను అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే హత్య చేసినట్లు పోలీసుల ఎదుట వివేక్ ఒప్పుకున్నాడు. ఏడేండ్లుగా రిలేషన్లో ఉన్నామని, పెండ్లి చేసుకునేందుకు నిరాకరించడంతో కోపం పట్టలేక చంపేసినట్లు డాక్టర్ వివేక్ చెప్పారు.


logo