సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Jun 29, 2020 , 12:41:05

కూతురిపై లైంగికదాడికి పాల్పడిన తండ్రి

కూతురిపై లైంగికదాడికి పాల్పడిన తండ్రి

  • బెంగుళూరులో ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి

మానవత్వం మంటగలుస్తోంది..  రోజురోజుకూ మానవులు మృగాళ్లా ప్రవర్తిస్తున్నారు.. కొన్ని ఘటనలు చూస్తుంటే అడవిలో ఉండాల్సిన మృగాళ్లు జనం మధ్యలో తిరుగుతున్నారా అనిపిస్తుంది. వావివరుసలు మరిచి చిన్నారుల పాలిట రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. మాయమాటలు చెప్పి వారి బతుకును చిదిమేస్తున్నారు. బంగారు భవిష్యత్‌ కలిగిన యువతులను మానసికంగా, శారీరకంగా వేధించి రాక్షసానందం పొందుతున్నారు. కామ వాంఛ తీర్చుకునేందుకు ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. ఈ దైనందిన పరిస్థితుల్లో ఆడపిల్ల జీవనమే ప్రశ్నార్థకంగా మారుతుందా? అనే సందేహం కలుగక మానడం లేదు.

 కాపాడాల్సిన కన్నతండ్రే కీచకుడిగా మారి కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన బెంగుళూరులో ఈనెల 23న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హరలూర్‌ ప్రాంతానికి చెందిన 40 ఏండ్ల ఓ రాక్షస తండ్రి కూతురిపై కన్నేశాడు. 19 ఏండ్ల కూతురు జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతుండగా.. ఇదే అదునుగా భావించిన తండ్రి ఆమెకు జ్వరానికి మందులు అని చెప్పి నిద్రమాత్రలు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తెల్లారేసరికి తండ్రి తన పక్కనే నిద్రించడం గమనించిన యువతి తనపై లైంగిక దాడి జరిగిందనే విషయం గుర్తించి సవతి తల్లికి చెప్పింది. ఆమె పట్టించుకోకపోవడంతో మనస్థాపానికి గురైన సదరు యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు గుర్తించి  రక్షించగా అనంతరం పోలీసులకు జరిగిన విషయాన్ని తెలియజేసి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు యువతిని దవాఖానకు తరలించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో సవతి తల్లి పాత్ర ఉందా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 


logo