శుక్రవారం 15 జనవరి 2021
Crime - Jan 13, 2021 , 21:33:50

తండ్రి మందలించాడని కుమారుడు ఆత్మహత్య

తండ్రి మందలించాడని కుమారుడు ఆత్మహత్య

కోదాడ :  తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురై కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఎస్‌ఐ రవీందర్ తెలిపిన వివరాలివి.. పట్టణంలోని శ్రీనివాస్ నగర్‌కు చెందిన నాలజాల సుబ్బారావు కుమారుడు మురళి (29) బీటెక్ చదువుతూ మధ్యలో ఆపేశాడు. కొంతకాలంగా బాధ్యతారహిత్యంగా తిరుగుతూ మద్యానికి బానిస అవుతుండటంతో తండ్రి మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మురళి ఇంటి పక్కన ఉన్న ప్రైవేట్ పాఠశాలలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.