బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Sep 13, 2020 , 20:25:52

భార్యాభర్తల గొడవ.. కుమార్తెను తండ్రి నేలకేసి కొట్టడంతో మృతి

భార్యాభర్తల గొడవ.. కుమార్తెను తండ్రి నేలకేసి కొట్టడంతో మృతి

నోయిడా : తల్లిదండ్రుల నడుమ గొడవ చిన్నారి ప్రాణాలను బలిగొంది. ఉత్తర ప్రదేశ్‌ నోయిడా జిల్లాలో ఈ ఘటన జరిగింది. బులంద్షహర్ జిల్లాకు చెందిన అమిత్ నోయిడాలోని బరోలా గ్రామంలో పని చేస్తూ భార్య రేణు కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నాడు. మధ్యానికి బానిసైన అతడు తరచూ భార్యతో గొడవ పడుతుండే వాడు. ఆదివారం ఉదయం భార్యభర్తల నడుమ గొడవ జరగడంతో భార్యపై దాడి చేసిన అమిత్‌ కోపంలో కుమార్తె(3) ను నేలకేసి కొట్టడంతో తలపగిలి చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో అమిత్‌ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసు ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన రేణును చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారని నోయిడా అదనపు పోలీసు కమిషనర్ రణవిజయ్ సింగ్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo