ఆదివారం 24 జనవరి 2021
Crime - Sep 25, 2020 , 15:50:20

ఆడపిల్ల పుట్టిందని.. కవర్‌లో చుట్టి నదిలో పారేసిన తండ్రి

ఆడపిల్ల పుట్టిందని.. కవర్‌లో చుట్టి నదిలో పారేసిన తండ్రి

తిరువనంతపురం : ఆడ పిల్ల పుట్టిందని నవజాత శిశువును హత్య చేసి కవర్‌లో చుట్టి నదిలో విసిరేసిన ఘటన కేరళ రాష్ట్రంలోని పచల్లూరు వద్ద చోటు చేసుకుంది. గమనించిన స్థానికుడు సదరు వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. తిరువల్లం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉన్నికృష్ణన్‌ అనే వ్యక్తి భార్య 40 రోజుల కిందట బాలికకు జన్మించింది. పుట్టింది బాలిక కావడంతో చిన్నారిని చంపాలని నిర్ణయించుకున్నాడు. దీంతో కొద్ది రోజులుగా చంపేందుకు పథకం వేశాడు. ఈ మేరకు గురువారం రాత్రి 7 గంటలకు చిన్నారి హత్య చేసి కవర్‌లో చుట్టాడు. అనంతరం పచల్లూరు సమీపంలోని వల్లతిన్ కడావు ఒడ్డుకు చేరుకొని శిశువు మృతదేహాన్ని కరమన నదిలో పడేశాడు. ఉన్నికృష్ణన్‌ అనుమానాస్పద స్థితిలో ఒడ్డున కనిపించడంతో ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. బుధవారం రాత్రి సైతం సదరు వ్యక్తి ఉన్నికృష్ణన్‌ను అదే ప్రాంతంలో గమనించాడు. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. పుట్టింది ఆడ శిశువు కావడంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. శిశువు మృతదేహాన్ని అగ్నిమాపక దళం, స్థానిక ఈతగాళ్ల సాయంతో స్వాధీనం చేసుకొని మెడికల్‌ కళాశాల దవాఖానకు తరలించారు. మృతదేహానికి పోర్టుమార్టం నిర్వహించి, ఉన్నికృష్ణన్‌ను మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరచనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo