సిరిసిల్ల‌లో ప్రియుడి తండ్రిని బ‌లిగొన్న 'ప్రేమ‌‌'

Oct 30, 2020 , 18:46:23

రాజ‌న్న సిరిసిల్ల : ఇద్ద‌రు యువ‌తీయువ‌కులు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. కానీ వీరి పెళ్లికి పెద్ద‌లు ఒప్పుకోలేదు. అమ్మాయికి వేరే పెళ్లి చేసేందుకు ఆమె కుటుంబ స‌భ్యులు సిద్ధ‌మ‌య్యారు. దీంతో ఆ యువ‌తిని ప్రేమించిన యువ‌కుడు.. ఆమెను తీసుకొని వెళ్లిపోయాడు. ఈ క్ర‌మంలో యువ‌కుడి తండ్రిపై యువ‌తి కుటుంబ స‌భ్యులు దాడి చేసి చంపేశారు. ఈ దారుణ ఘ‌ట‌న బోయిన‌ప‌ల్లి మండ‌లం స్తంభంప‌ల్లిలో చోటు చేసుకుంది. 

స్తంభంప‌ల్లి గ్రామానికి చెందిన గౌత‌మిని మ‌హేశ్ అనే యువ‌కుడు కొంత‌కాలం నుంచి ప్రేమిస్తున్నాడు. అయితే వీరి ప్రేమ వ్య‌వ‌హారం యువ‌తి ఇంట్లో తెలిసింది. వీరిద్ద‌రికి పెళ్లి చేసేదే లేద‌ని తేల్చిచెప్పారు. గౌత‌మికి మ‌రో అబ్బాయితో వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 28న ఆమెకు నిశ్చితార్థం ఉండ‌గా.. 27వ తేదీన‌ మ‌హేశ్ ఆమె తీసుకొని గ్రామం నుంచి పారిపోయాడు. దీంతో గౌత‌మి త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అదే రోజు మ‌హేశ్ తండ్రి తునికి ల‌క్ష్మీనారాయ‌ణ‌(58)పై దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచారు. క‌రీంన‌గ‌ర్‌లోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో ల‌క్ష్మీనారాయ‌ణ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా స్తంభంప‌ల్లిలో పోలీసులు భారీగా మోహ‌రించారు. ( చూడండి : ఆ కోట ఇలా కూలిపోయింది..వీడియో )


తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD