గురువారం 28 జనవరి 2021
Crime - Nov 21, 2020 , 12:04:02

కూతురితో తండ్రి అసభ్యకర ప్రవర్తన..కేసు నమోదు

కూతురితో తండ్రి అసభ్యకర ప్రవర్తన..కేసు నమోదు

యాదాద్రి భువనగిరి : కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కనుపాపను కాటెయ్యాలని చూశాడు. జిల్లాలోని మోత్కూర్ మండల కేంద్రంలో కన్న కూతురితోనే ఓ తండ్రి అసభ్యకరంగా ప్రవర్తించాడు. పోలీసుల కథనం మేరకు..బోడుపల్లి లక్ష్మయ్య ఆటో డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. ఆయనకు భార్య, నలుగురు కూతుర్లు ఉన్నారు. లక్ష్మయ్య తరచుగా భార్యతో గొడవ పడుతుండటంతో భార్య గత 17 సంవత్సరాల క్రితం లక్ష్మయ్యను వదిలి వెళ్లిపోయింది. 

ఈ క్రమంలో 2018 సంవత్సరంలో వీరి మూడో కూతురు మరణించడంతో విషయం తెలుసుకొని భార్య తిరిగి వచ్చి భర్త పిల్లలతో కలిసి ఉంటుంది. కాగా, గత ఇరవై రోజుల నుంచి భార్య భర్తలు ఇద్దరూ గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో నాలుగో కూతురు తండ్రికి అన్నం పెట్టే క్రమంలో కూతురుతో అసభ్యంగా ప్రవర్తించాడు. శారీరకంగా లొంగదీసుకోవడానికి ప్రయత్నించడంతో ఆమె తిరస్కరిస్తుంది. 

ఈ విషయం బయట ఎవరికి చెప్పకూడదని వాళ్లను బెదిరించ సాగాడు. తనకు అందరూ తెలుసని విషయం బయట పెడితే మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తా అని బెదిరించాడు. దీంతో బాలిక స్థానిక పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై నిందితుడిపై ఫోక్సో చట్టం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపారు.


logo