శనివారం 16 జనవరి 2021
Crime - Jan 01, 2021 , 08:35:12

కొడుకును అరెస్టు చేయించిన తండ్రి

కొడుకును అరెస్టు చేయించిన తండ్రి

హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లోన్‌ యాప్‌ల కేసులో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులు ప్రధాన నిందితుల్లో ఒకరైన నాగరాజును ఆయన తండ్రే పట్టించాడు. లోన్‌ యాప్‌ల కేసులో రెండు రోజుల క్రితం చైనా దేశీయుడు ల్యాంబో, కర్నూలు జిల్లా వాసి నాగరాజును పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన నాగరాజు..  ల్యాంబో తరఫున ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో లోన్‌ యాప్‌ వ్యవహారాలను చూసుకునేవాడు. ఈ క్రమంలో నాగరాజు తన సోదరుడిని కూడా రుణ యాప్‌ల సంస్థలో చేర్పించాడు.


అయితే నాగరాజు తండ్రి కర్నూలు జిల్లాలో ఏఎస్‌గా పనిచేస్తున్నారు. కొన్ని రోజులుగా నాగరాజు వ్యవహారాన్ని గ్రహించారు. అతనిపై అనుమానంతో అసలు విషయాలు తెలుసుకోవడం ప్రారంభించారు. దీంతో నాగరాజును ఢిల్లీ నుంచి ఇంటికి రప్పించారు. అనంతరం హైదరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేంతవరకు నాగరాజును ఇంట్లోనే ఉండేలా చేసి పోలీసులకు పట్టించారు. అయితే తన వివరాలు బహిర్గతం చేయకూడదని ఆ ఎస్‌ఎస్‌ఐ.. సైబర్‌క్రైం అధికారులను కోరారు.