శనివారం 28 నవంబర్ 2020
Crime - Oct 26, 2020 , 12:50:44

తండ్రి, ఇద్ద‌రు కూతుళ్లు ఆత్మ‌హ‌త్య‌

తండ్రి, ఇద్ద‌రు కూతుళ్లు ఆత్మ‌హ‌త్య‌

ఒడిశా : రాయ‌గ‌ఢ జిల్లా టెకిరి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని చింగారంలో విషాదం నెల‌కొంది. చింగారం స్టేష‌న్‌లో రైలు కింద ప‌డి ఓ తండ్రి, త‌న ఇద్ద‌రు కుమార్తెలు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఘ‌ట‌నాస్థ‌లికి నుంచి మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుల‌ను పొడాప‌డి గ్రామానికి చెందిన కోదండ సెబుధి(45), భాగ్య‌ల‌క్ష్మి సెబుధి(12), స‌హ‌నా సెబుధి(7)గా పోలీసులు గుర్తించారు. కుటుంబ స‌మ‌స్య‌ల‌తో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.