దళిత యువకుడ్ని ప్రేమించిన బాలిక పరువుహత్య

బెంగళూరు: దళిత యువకుడ్ని ప్రేమించిన బాలికను ఆమె తండ్రితోపాటు కుటుంబ సభ్యులు పరువుహత్య చేశారు. కర్ణాటకలోని రామనగర జిల్లా బెట్టహల్లి గ్రామంలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. 20 ఏండ్ల దళిత యువకుడితో సంబంధం ఉందన్న కారణంతో 18 ఏండ్ల బాలికను ఆమె తండ్రి, సోదర వరుసయ్యే ఇద్దరు ఈ నెల 9న గ్రామ శివారులోని తోటలోకి తీసుకెళ్లారు. డంబుల్తో ఆమె తలపై మోది హత్య చేసి అక్కడ పూడ్చిపెట్టారు. అనంతరం తన కుమార్తె కనిపించడంలేదంటూ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె ప్రియుడిపై అనుమానం ఆయన వ్యక్తం చేశాడు. పోలీసులు ఆ దళిత యువకుడ్ని ప్రశ్నించగా బాలిక అదృశ్యం వెనుక అతడి ప్రమేయం లేదని తెలిసింది.
మరోవైపు ఆరు రోజుల తర్వాత ఆ తోటలో మొక్కలు నాటేందుకు అక్కడివారు తవ్వగా శిథిలమైన బాలిక మృతదేహం బయటపడింది. దీంతో పోలీసులు ఆమె తండ్రిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. మరో ఇద్దరి సహాయంతో తన కుమార్తెను హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండితాజావార్తలు
- రుణయాప్ డైరెక్టర్లు చైనాకు..?
- గొర్రె, పొట్టేలుకు కల్యాణం.. ఎందుకో తెలుసా?
- సాయుధ దళాల సేవలు అభినందనీయం
- అడ్డుగా ఉన్నాడనే.. భర్తను హత్య చేసింది
- నగరి ఎమ్మెల్యే రోజా కంటతడి
- నేరాలకు ఎంటర్నెట్
- వరి నాటు వేసిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- ఆదిపురుష్‌పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రభాస్
- ఆయన సేవ.. మరొకరికి తోవ..
- లీజుకు పది హరిత హోటళ్లు