శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Jun 20, 2020 , 11:17:11

తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్య

తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్య

పెద్దపల్లి: జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లికి చెందిన మందల రాజిరెడ్డి అనే రైతు పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అతనివద్ద సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు రెవెన్యూ అధికారులు, వీఆర్‌వో గురుమూర్తి, వీఆర్‌ఏ స్వామి కారణమని లేఖలో పేర్కొన్నారు. తన 20 గుంటల భూమికి పట్టా ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని అందులో రాశారు. సూసైడ్‌ నోట్‌లో ఎమ్మార్వో వేణుగోపాల్‌ పేరు కూడా ప్రస్తావించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, రైతు మృతదేహాన్ని దవాఖానకు తరలించారు.


logo