ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Sep 09, 2020 , 16:11:34

మాదారంలో తేనెటీగల దాడిలో రైతు మృతి

మాదారంలో తేనెటీగల దాడిలో రైతు మృతి

ఖమ్మం : జిల్లాలోని కారేపల్లి మండలం మాదారం గ్రామంలో తేనెటీగల దాడిలో  ఓ రైతు మృతి చెందాడు. మాదారం గ్రామానికి చెందిన నల్లడి రామారావు అనే రైతు పొలం పనుల కోసం బుధవారం వెళ్లాడు. తాను పని చేస్తున్న  పొలం పక్కనే కందిరీగలు తుట్టెను పెట్టాయి. ఆ చెట్టు పైకి ఎక్కిన కోతులు కొమ్మలను ఊపడంతో.. ఒక్కసారిగా కందిరీగలు లేచి రామారావును కుట్టాయి. భయంతో పరిగెత్తిన రామారావు కొద్ది దూరం పరిగెత్తి కిందపడిపోయాడు. ఆయాసానికి గురై గుండె ఆగి చనిపోయాడు. స్థానికులు గుర్తించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.


logo