శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Crime - Jan 24, 2021 , 19:46:29

మోటార్‌ ఆన్‌చేస్తుండగా విద్యుదాఘాతంతో రైతు మృతి

మోటార్‌ ఆన్‌చేస్తుండగా విద్యుదాఘాతంతో రైతు మృతి

వనపర్తి : వనపర్తి జిల్లా శ్రీరంగపూర్ మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్‌ మోటార్‌ ఆన్‌ చేస్తుండగా కరెంట్‌ షాక్‌కు గురై రైతు మృతి చెందాడు. గ్రామానికి చెందిన రైతు, సింగిల్ విండో డైరెక్టర్ సింగోటం (55)  ఉదయం నాటు ఉండటంతో పొలం వద్దకు వెళ్లాడు. కూలీలు నాటు వేస్తుండగా నీళ్లు పెట్టేందుకు స్టార్టర్‌ ఆన్‌ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అప్పటిదాక తమతో కలిసి పనిచేసిన రైతు ప్రాణాలు కోల్పోవడంతో కూలీలు సైతం కన్నీటిపర్యంతమయ్యారు. రైతుకు రైతుబీమా వర్తించనున్నట్లు అధికారులు తెలిపారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo