మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Sep 04, 2020 , 19:11:35

ఫ్రెండ్ చెల్లితో ప్రేమాయ‌ణం.. చివ‌రికి హ‌త్య‌

ఫ్రెండ్ చెల్లితో ప్రేమాయ‌ణం.. చివ‌రికి హ‌త్య‌

ఢిల్లీ : ఓ యువ‌కుడు త‌న సోద‌రిని ప్రేమించినందుకు స్నేహితుడిని దారుణంగా హ‌త్య చేశాడు. పోలీసులు తెలిపిన వివ‌రాలు.. బ‌వానాలోని సెక్టార్ 4 ప్రాంతంలోని ఓ నెయిల్ పాలిష్ త‌యారీ సంస్థ‌లో రాజ్‌(26), అర్మాన్‌, క‌ర‌ణ్‌సింగ్ అనే ముగ్గురు స్నేహితులు ప‌ని చేస్తుండేవారు. రాజ్, అర్మాన్ సోద‌రి మ‌ధ్య కొన్ని రోజులుగా ప్రేమ వ్య‌వ‌హారం న‌డుస్తోంది. దీని గురించి రాజ్ ఇత‌ర స్నేహితుల మ‌ధ్య ప్ర‌గ‌ల్బాలు ప‌లుక‌డంతో ఆర్మ‌న్‌కు సిగ్గుగా అనిపించేది. ఈ వ్య‌వ‌హారంపై రాజ్‌ను ప‌లుమార్లు హెచ్చ‌రించినా విన‌క‌పోవ‌డంతో ఎలాగైనా హ‌త్య చేయాల‌ని అర్మాన్‌ నిర్ణ‌యం తీసుకున్నాడు. 

ఈ నేప‌థ్యంలో గురువారం సాయంత్రం 5 గంట‌ల స‌మ‌యంలో అర్మాన్ మ‌రో స్నేహితుడు క‌ర‌ణ్‌సింగ్‌తో క‌లిసి రోహిణిలోని ప్రహ్లాద్‌పూర్ సమీపంలో రాజ్‌ను ప‌దునైన ఆయుధంతో గొంతు కోసి హ‌త్య చేశాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు మొద‌ట గుర్తు తెలియ‌ని మృత‌దేహం ల‌భించిన‌ట్లు కేసు న‌మోదు చేసుకున్నా.. ద‌ర్యాప్తులో భాగంగా క‌ర‌ణ్‌, అర్మాన్ గురించి తెలుసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నారు. నిందితుల‌ను అదుపులోకి తీసుకొని హ‌త్య‌కు వినియోగించిన క‌త్తి, ద్విచ‌క్ర‌వాహ‌నాన్ని వారి నుంచి స్వాధీనం చేసుకున్నామ‌ని పోలీసులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo