బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Aug 11, 2020 , 12:43:00

నకిలీ మావోయిస్టులు అరెస్టు

నకిలీ మావోయిస్టులు అరెస్టు

ఆసిఫాబాద్ : మావోయిస్టుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఆసిఫాబాద్ జిల్లా ఇంచార్జ్ ఎస్పీ విష్ణు వారియర్ తెలిపారు. ఇటీవల తిర్యాని అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే విషయాన్ని ఆసరగా చేసుకొని.. కెరమెరి మండలానికి చెందిన కొట్నాక బుజ్జి రావు, కొట్నాక్ రఘునాథ్, దండుగుల భీమ్రావు అనే వ్యక్తులు మావోయిస్టుల పేరుతో దందాలకు పాల్పడుతున్నారు. కాంట్రాక్టర్లను, రాజకీయ నాయకులను, వ్యాపారస్తులను, డబ్బున్న వాళ్లను బెదిరిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. మావోయిస్టు నాయకుడు భాస్కర్ పేరుని వినియోగించుకొ౦టూ ఒక పిస్తోల్, రెండు నకిలీ రివాల్వర్లను చూపిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆయన వివరించారు.


logo