శుక్రవారం 22 జనవరి 2021
Crime - Dec 16, 2020 , 19:43:28

నకిలీ ఉద్యోగ రాకెట్‌ ముఠా గుట్టురట్టు.. ముగ్గురి అరెస్టు

నకిలీ ఉద్యోగ రాకెట్‌ ముఠా గుట్టురట్టు.. ముగ్గురి అరెస్టు

సంగారెడ్డి : నకిలీ ఉద్యోగ రాకెట్‌ ముఠా గుట్టును బహిర్గపరిచిన పోలీసులు ముగ్గురి వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ సంఘటన సంగారెడ్డిలో చోటుచేసుకుంది. ప్రాథమిక దర్యాప్తు మేరకు నిందితులు ఇప్పటివరకు 25 మంది నిరుద్యోగులను మోసం చేసినట్లుగా సమాచారం. వీరి వద్ద నుంచి 67 లక్షలను వసూలు చేశారు. సంగారెడ్డి డీఎస్పీ ఏ. బాలాజీ మీడియాకు వివరాలను వెల్లడించారు. నలుగురు నిందితుల్లో ఒకరైనా ఎర్రోళ్ల బండెమ్మ 25 మంది నిరుద్యోగులను ఈ ముగ్గురి వ్యక్తులకు పరిచయం చేసిందన్నారు.

కొండాపూర్‌ మండలం తోగార్‌పల్లికి చెందిన బండెమ్మ.. పెద్దపల్ల జిల్లా గోదావరిఖనికి చెందిన నూతి రవీందర్‌, కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడికి చెందిన బత్తిని వైకుంఠం, విజయ్‌ కుమార్‌తో జతకూడి నిరుద్యోగులను మోసం చేసింది. తాను కూడా బాధితురాలినేనని పేర్కొంటూ బండెమ్మ పోలీసులను ఆశ్రయించింది. కాగా ఈమె మోసానికి పాల్పడినట్లుగా తగినన్నీ ఆధారాలు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. పోలీసులు ముగ్గురి వ్యక్తులను అరెస్టు చేయగా మరో వ్యక్తి విజయ్‌ కుమార్‌ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి చెక్కు బుక్‌లు, ఫోన్లు, నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 


logo