గురువారం 28 జనవరి 2021
Crime - Jan 05, 2021 , 09:42:59

ఫేక్‌ ఇన్సురెన్స్‌ ముఠా అరెస్ట్‌

ఫేక్‌ ఇన్సురెన్స్‌ ముఠా అరెస్ట్‌

రంగారెడ్డి : ఇన్సురెన్స్‌ పేరిట మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును శంషాబాద్‌ పోలీసులు రట్టు చేశారు. వివిధ కంపెనీల పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న ముఠాను మంగళవారం శంషాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఎయిర్ పోర్ట్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఫేక్ ఇన్సురెన్స్‌ పత్రాలు తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్‌ఓటీసీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నకిలీ పత్రాలు తయారు చేస్తున్న 11 మంది సభ్యుల ముఠాను చాకచక్యంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారి నుంచి పెద్ద ఎత్తున నకిలీ ఇన్సురెన్స్‌ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే వివిధ కంపెనీలకు చెందిన స్టాంపులు, ప్రింటర్లు సీజ్‌ చేశారు.  


logo