బుధవారం 20 జనవరి 2021
Crime - Sep 22, 2020 , 17:23:37

కాకినాడలో నకిలీ కరెన్సీ ముఠా అరెస్టు...

 కాకినాడలో నకిలీ కరెన్సీ ముఠా అరెస్టు...

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లోని  కాకినాడలో నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టయింది.కేంద్రం సర్కారు  రూ. 2 వేల నోట్లను రద్దు చేస్తుందని నమ్మించి జనాలను మోసం చేసేందుకు ప్రయత్నించింది ఓ ముఠా. కేంద్రం రూ. 2 వేల నోట్లను రద్దు చేయనుందని.. తమ దగ్గర ఉన్న రెండు వందల కోట్లను తక్కువకే ఇస్తామంటూ చీటింగ్ చేసేందుకు యత్నించింది. రెండు వేల రూపాయల నోట్లు నిల్వ ఉన్న వీడియోను చూపించి బాధితుడిని బురిడీ కొట్టించాలని భావించింది.

90 లక్షల రూపాయల విలువైన 5 వందల రూపాయల నోట్లు ఇస్తే కోటి రూపాయిల విలువైన 2 వేల రూపాయల నోట్లు ఇస్తామని కాకినాడకు చెందిన నాగ ప్రసాద్ అనే వ్యక్తిని ఈ ముఠా నమ్మించింది. మొదట్లో వారి మాటలు నమ్మిన నాగప్రసాద్.. ఆ తరువాత అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో నకిలీ కరెన్సీ ముఠా మోసం వెలుగులోనికి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. విశాఖ జిల్లాకు చెందిన నలుగురు సభ్యుల ముఠా‌తో పాటు కాకినాడకు చెందిన మరో నిందితుడిని అరెస్టు చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo