సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Aug 25, 2020 , 20:29:27

తమ్ముడి భార్యతో వివాహేతర సంబంధం.. చివరికి హత్య

తమ్ముడి భార్యతో వివాహేతర సంబంధం.. చివరికి హత్య

లక్నో :  తమ్ముడి భార్యతో భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న అన్నను దారుణంగా గొంతు కోసి హత్యచేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ర్టం లక్నోలోని చిన్హాట్‌ మాటియారీ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాలు.. చిన్హాట్‌ గ్రామానికి చెందిన ఆశిశ్‌యాదవ్‌, అలోక్‌, అంకుర్‌ ముగ్గురు అన్నదమ్ములు. ఆశిశ్‌, అలోక్‌కు వివాహాలు కాగా అంకుర్‌కు ఇంకా కాలేదు. అలోక్‌ వృత్తి రిత్యా బయటికి వెళ్లినప్పుడు అతడి భార్యతో ఆశిశ్‌ చనువుగా మాట్లాడుతూ ఉండేవాడు. ఆ చనువు కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నిరోజుల పాటు వీరిద్దరు తమ్ముడికి తెలియకుండా సంబంధాన్ని నడిపారు. ఓరోజు వీరి గుట్టు తమ్ముడు అలోక్‌కు తెలియగా అన్నపై తీవ్ర కోపాన్నిపెంచుకొని ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. 

ఈ నేపథ్యంలో ఆశిశ్‌యాదవ్‌ ఇంట్లో తన భార్యతో కలిసి ఉండగా ఆదివారం తమ్ముళ్లు అలోక్‌, అంకుర్‌ వెళ్లి అక్రమ సంబంధం గురించి గొడవకు దిగారు. ముగ్గురి మధ్య వాగ్వాదం తీవ్రం కాగా అలోక్‌, అంకుర్‌ కూరగాయల కోసే కత్తితో అన్న గొంతు కోసి పారిపోయారు. తీవ్ర రక్తస్రావంతో ఆశిశ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు.

ఆశిశ్‌యాదవ్‌ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించినట్లు లక్నో ఈస్ట్ జోన్ అడిషనల్‌ డీసీపీ అమిత్ కుమార్ తెలిపారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్నొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo