సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Jul 31, 2020 , 14:47:54

సుశాంత్ కేసును ఈడీ విచారించాలి: ఫ‌డ్న‌వీస్‌

సుశాంత్ కేసును ఈడీ విచారించాలి: ఫ‌డ్న‌వీస్‌

హైద‌రాబాద్‌: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ విచారించాల‌ని  మ‌హారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్నవీస్ తెలిపారు. భారీ మొత్తంలో సుశాంత్ డ‌బ్బును అక్ర‌మ రీతిలో వాడుకున్న‌ట్లు తెలుస్తోందని ఆయ‌న అన్నారు. సుశాంత్ అకౌంట్ నుంచి సుమారు 15 కోట్ల అమౌంట్‌ను రియా వాడుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో ఆమెను విచారించాల‌న్న డిమాండ్ పెరుగుతున్న‌ది.  అంత భారీ స్థాయిలో అమౌంట్ ఎలా సుశాంత్ అకౌంట్ నుంచి ఖాళీ అయ్యిందో తేలాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మాజీ సీఎం ఫ‌డ్న‌వీస్ తెలిపారు.  కేసు విచార‌ణ నిమిత్తం ముంబై వెళ్లిన బీహార్ పోలీసులు..  రియాను క‌స్ట‌డీలోకి తీసుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. రియాతో పాటు ఆమె సోద‌రుడు, పేరెంట్స్‌.. అక్ర‌మ‌రీతిలో సుశాంత్ డ‌బ్బును వాడిన‌ట్లు గుర్తించారు. కేసును సీబీఐకి అప్ప‌గించ‌కున్నా.. క‌నీసం ఈడీకి ఇవ్వాల‌ని, ఎందుకంటే దీంట్లో మ‌నీ ల్యాండ‌రింగ్ ఆరోప‌ణ‌లు ఉన్నాయ‌ని ఫ‌డ్నవీస్ తెలిపారు.


logo