ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Sep 07, 2020 , 20:15:19

దోపిడీకి యత్నించిన దొంగలు, పోలీసుల మధ్య కాల్పులు

దోపిడీకి యత్నించిన దొంగలు, పోలీసుల మధ్య కాల్పులు

పాట్నా: దోపిడీకి యత్నించిన దొంగలు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. బీహార్‌లోని ముజఫర్పూర్‌లో సోమవారం ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న హీరో హోండా ఏజెన్సీలో దోపిడీకి కొందరు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి వచ్చారు. దీంతో దొంగలు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక పోలీస్, ఒక దొంగ గాయపడ్డారు. అనంతరం ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్న తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి జయంత్ కాంత్ తెలిపారు.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo