మంగళవారం 19 జనవరి 2021
Crime - Nov 23, 2020 , 11:27:11

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు నక్సలైట్ల మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు నక్సలైట్ల మృతి

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని కాంకర్‌లో భద్రతా దళాలు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ముగ్గురు నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఓ మహిళా నక్సలైట్‌ ఉన్నట్లు సమాచారం. ఓ ఎస్‌ఎస్‌బీ జవాన్‌కు కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశంలో భద్రతా దళాలు సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాయి. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.