శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Jun 16, 2020 , 16:04:13

ఛతీస్‌గఢ్‌‌లో విద్యుదాఘాతంతో ఏనుగు మృతి

ఛతీస్‌గఢ్‌‌లో విద్యుదాఘాతంతో ఏనుగు మృతి

రాయ్‌ఘడ్‌ : ఛతీస్‌గఢ్‌ రాష్ట్రంలోని రాయ్‌ఘడ్‌ జిల్లా ధరమ్జాఘడ్‌ బ్లాక్‌ పరిధిలోని గ్రామంలో మంగళవారం విద్యుదాఘాతంతో ఏనుగు మృతి చెందింది.  విషయం తెలుసుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అటవీ ప్రాంతంలో దుండగులు అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగ తగలడంతో విద్యుదాఘాతానికి గురై ఏనుగు మృతి చెందిందని నిర్ధారించారు.  మృతి చెందిన ఏనుగు వయసు 7నుంచి 8 సంవత్సరాల వరకు ఉంటుందని రాయ్‌ఘడ్‌ ఎస్పీ సంతోశ్‌కుమార్‌ సింగ్‌ తెలిపారు. ఇదే ప్రాంతంలో ఇదే తరహా ప్రమాదాలు అనేకం జరిగాయని, కొంతమంది ప్రాణాలు సైతం కోల్పోయారని ఎస్పీ పేర్కొన్నారు.  నేరంతో సంబంధముందని భావిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. 


logo