ఏనుగుకు నిప్పు.. కాలిన గాయాలతో మృతి

చెన్నై: ఏనుగుకు కొందరు నిప్పుపెట్టడంతో కాలిన గాయాలతో మరణించింది. తమిళనాడులోని నీలగిరి అటవీ ప్రాంత గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. మాసినగుడి గ్రామంలోకి 40 ఏండ్ల అడవి ఏనుగు ఇటీవల ప్రవేశించింది. దీంతో దానిని తరిమేందుకు కొందరు గ్రామస్తులు ప్రయత్నించారు. ఇందులో భాగంగా కాలుతున్న టైర్‌ను ఏనుగుపైకి విసిరారు. అయితే అది ఏనుగు చెవులకు చిక్కుకున్నది. కాలుతున్న టైర్ మంటలకు తాళలేక అక్కడి నుంచి అడవిలోకి పారిపోయింది.
కాగా, తల వెనుక, చెవుల వద్ద తీవ్రంగా కాలిన గాయాలతో పడి ఉన్న ఆ ఏనుగును అటవీ సిబ్బంది గమనించారు. తెప్పకాడు ఏనుగు శిబిరానికి తీసుకెళ్లి చికిత్స అందించేందుకు ప్రయత్నించారు. అయితే ఆ ఏనుగు ఈ నెల 19న చనిపోయినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఏనుగుకు నిప్పుపెట్టిన ముగ్గురిని గుర్తించి వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఇద్దరిని అరెస్ట్ చేయగా మరొక వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
కాగా, ఏనుగుకు నిప్పుపెట్టిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. ఈ దారుణాన్ని నెటిజన్లు ఖండించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఎంజీఆర్ రూట్లో కమల్ హాసన్.. ఆ స్థానం నుంచే పోటీ !
- సౌదీ అరేబియాలో ప్రారంభమైన ‘వార్ఫేర్’
- బీజింగ్‌కు చెక్ : డ్రాగన్ పెట్టుబడి ప్రతిపాదనలపై ఆచితూచి నిర్ణయం!
- బ్రెజిల్లో మళ్లీ కరోనా విజృంభణ.. ఒక్కరోజే 1,641 మంది మృతి
- ‘సీటీమార్’ టైటిల్ ట్రాక్‌కు ఈల వేయాల్సిందే
- కోవిడ్ టీకా తీసుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
- మదర్సాలలో భగవద్గీత, రామాయణం
- అనురాగ్ కశ్యప్, తాప్సీ ఇండ్లల్లో ఐటీ సోదాలు
- పెండ్లి తర్వాత కొన్ని గంటలకే గుండెపోటుతో వధువు మృతి..!
- భారత పరిశ్రమల పితామహుడు జంషెడ్జీ టాటా.. చరిత్రలో ఈరోజు