స్టార్ డైరెక్టర్ శంకర్, టాలీవుడ్ హీరో రాంచరణ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ ప్రాజెక్టు కంటిన్యూగా హెల్ లైన్స్ లో నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా హీరోయిన్ ఎవరనే విషయంపై చాలా వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే ఫీమేల్ లీడ్ రోల్లో కనిపించబోతున్నారంటూ అలియాభట్, కైరా అద్వాని పేర్లు వినిపించాయి.
అయితే తాజాగా కోలీవుడ్ భామ మాళవిక మోహనన్ పేరు లైమ్ లైట్ లోకి వచ్చింది. రాంచరణ్ కు జోడీగా మాళవిక మోహనన్ అయితే బాగుంటుందని శంకర్ టీం భావిస్తున్నట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోయే ఈ చిత్రానికి మాళవిక హీరోయిన్ గా సెలెక్ట్ అయితే ఎంతవరకు న్యాయం చేస్తుందనేది చూడాలి. విజయ్ నటించిన మాస్టర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది మాళవికమోహనన్.
ఇవి కూడా చదవండి..
అప్పుడు మిస్సయిన ఛాన్స్ మళ్లీ వచ్చింది..!
హీరో సుశాంత్ సింగ్ ప్రియురాలికి బిగ్ బాస్ ఆఫర్
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్‌కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్