శుక్రవారం 22 జనవరి 2021
Crime - Nov 17, 2020 , 15:31:57

ఏసీబీ వలలో విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగి

ఏసీబీ వలలో విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగి

మేడ్చల్‌ : అవినీతికి పాల్పడుతూ విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా కీసరలో చోటుచేసుకుంది. సబ్‌ జూనియర్‌ ఇంజినీర్‌ విజయేందర్‌ రూ. 13 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డాడు. కీసర విద్యుత్‌ కార్యాలయంలో విజయేందర్‌ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. విజయేందర్‌తో పాటు మరో ముగ్గురిని ఏఈ, ఏడీఈ, మరో సబ్‌ ఇంజినీర్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.


logo