ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా
సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వ సబ్సిడీ
తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ శ్రీరంగారావు
బోయినపల్లి, ఏప్రిల్ 16 : సెస్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ శ్రీరంగారావు పేర్కొన్నారు. సెస్ సిబ్బంది, అధికారులు రైతులతో సయోధ్యతో ఉండి వారి కష్టాల్లో పాలు పంచుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలకేంద్రంలో శుక్రవారం సెస్ వినియోగదారుల విద్యుత్ సమస్యల పరిష్కార వేదికకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వం నిర్మించిన రైతు వేదికలు దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని చెప్పారు. రైతులు వ్యవసాయ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీని ఇస్తుందని చెప్పారు. రైతు వ్యవసాయ భూమిలో 7.5 హెచ్‌పీల విద్యుత్ మోటర్‌కు సోలార్ పవర్‌ను వినియోగించుకోవచ్చని అన్నారు. ఈ సందర్భంగా సెస్‌కు సంబంధించిన రైతులు చెప్పిన సమస్యలను నోట్ చేసుకున్నానని, సెస్ ఎండీ రామకృష్ణను హైదరాబాద్‌కు పిలిచి మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఉద్యోగులు అవినీతికి పాల్పడితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు.
సెస్ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. సెస్‌లో దీర్ఘ కాలికంగా పని చేస్తున్న వారిని బదిలీ చేయాలని, ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని సెస్ ఎండీకి సూచించారు. వినియోగ దారుల సమస్యలు ఫిర్యాదు కోసం యాప్‌ను తయారు చేస్తున్నట్లు చెప్పారు. వినియోగదారులు విద్యుత్ బకాయిలు లేకుండా చూసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా రామన్నపేటలో విద్యుదాఘాతంతో మృతి చెందిన రైతు కుటుంబాలు నల్ల పద్మ, లక్ష్మి కుటుంబాలకు ఒక్కొక్కరికీ 5లక్షల చొప్పున 10 లక్షల ఆర్థిక సాయం చెక్కులను అందించారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, సెస్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేయాలని కోరారు. విధులను నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సెస్ ఎండీ రామకృష్ణ , ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, కరీంనగర్ ఎస్ఈ మాధవరావు, డీఈఈ రఘుపతి, సెస్ ఏఈ రాకేశ్ రెడ్డి, లైన్ ఇన్స్పెక్టర్ కుసుంబ తిరుపతి, కిసాన్ సంఘ్ ప్రతినిధి జోగినపల్లి సంపత్‌రావు, టీఆర్ఎస్ నాయకులు కత్తెరపాక కొండయ్య ఉన్నారు.
ఇవి కూడా చదవండి
గిరిజన గ్రామానికి పోలీసుల బోర్వెల్ స్పాన్సర్
IPL 2021: నెమ్మదిగా టార్గెట్ వైపు చెన్నై అడుగులు