సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Sep 05, 2020 , 12:02:59

భూవివాదం.. గొడ్డ‌లితో త‌మ్ముడిపై అన్న దాడి

భూవివాదం.. గొడ్డ‌లితో త‌మ్ముడిపై అన్న దాడి

ఖ‌మ్మం : జిల్లాలోని ముదిగొండ మండ‌లం చిరుమ‌ర్రి గ్రామంలో దారుణం జ‌రిగింది. ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల మ‌ధ్య నెల‌కొన్న భూవివాదం.. ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు దారి తీసింది. గాలి కోట‌య్య‌, గాలి ఉప్ప‌య్య అన్న‌ద‌మ్ములు. వీరిద్ద‌రి మ‌ధ్య గ‌త కొంత కాలం నుంచి పొలం గెట్టు విష‌యంలో పంచాయితీ న‌డుస్తోంది. ఈ క్ర‌మంలో శ‌నివారం ఉద‌యం ఉప్ప‌య్య‌పై కోట‌య్య గొడ్డ‌లితో దాడి చేసి న‌రికాడు. తీవ్ర గాయాల‌పాలైన ఉప్ప‌య్య‌ను చికిత్స నిమిత్తం ఖ‌మ్మం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. చిరుమ‌ర్రి గ్రామంలో పోలీసులు మోహ‌రించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo