సోమవారం 25 జనవరి 2021
Crime - Dec 13, 2020 , 08:14:11

వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి

వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి

హైదరాబాద్‌: రాజధానిలో ఇవాళ ఉదయం జరిగిన వేర్వేరే ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందారు. ఇవాళ తెల్లవారుజామున గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్‌లో జరిగి ప్రమాదంలో ఐదుగరు మరణించగా, పటాన్‌చెరూ, కూకట్‌పల్లిలో జరిగి రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు యువకులు మృతిచెందారు. ఈ మూడు ప్రమాదాలకు కారణం లారీలే కావడం గమనార్హం.

గచ్చిబౌలీలోని విప్రో సర్కిల్‌లో ఇవాళ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఓ కారును టిప్పర్‌ లారీ ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు మరణించారు. ప్రమాద ధాటికి కారు పూర్తిగా ధ్వంసమయ్యింది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. 

హైదరాబాద్‌ శివార్లలోని పటాన్‌చెరూ సమీపంలో ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పటాన్‌చెరూ మండలంలోని ముత్తారం వద్ద ఓ బైన్‌ను కంటైనర్‌ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మృతులు సంగారెడ్డి జిల్లా మృతులు రుద్రారానికి చెందిన రాజు, ఆంజనేయులుగా గుర్తించారు. 

మరో ఘటనలో కూకట్‌పల్లిలోని మెట్రో పిల్లర్‌ 836 వద్ద ఓ లారీ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ప్రకాశ్‌ అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరిన పోలీసుల మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు.  


logo