సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Aug 28, 2020 , 16:50:45

చిన్న గొడ‌వ‌కే యాసిడ్ దాడి.. 8 మందికి తీవ్ర గాయాలు

చిన్న గొడ‌వ‌కే యాసిడ్ దాడి.. 8 మందికి తీవ్ర గాయాలు

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం సిహోర్ జిల్లాలోని ఖైఖేడా గ్రామంలో దారుణం జ‌రిగింది. గ్రామంలోని ఓ డైరీ ఫామ్ ద‌గ్గ‌ర జ‌రిగిన చిన్న గొడ‌వ యాసిడ్ దాడికి దారితీసింది. డైరీఫామ్ య‌జ‌మాని కుమారులైన రాహుల్‌, దీప‌క్‌కు పాల కోసం వ‌చ్చిన వారికి మ‌ధ్య గురువారం వాగ్వాదం జ‌రిగింది. ఈ వాగ్వాదం మ‌రింత ముద‌ర‌డంతో రాహుల్‌, దీప‌క్ వారిపై యాసిడ్ దాడి చేశారు. ఈ దాడిలో నిందితులు ఇద్ద‌రితోపాటు మొత్తం ఎనిమిది మందికి తీవ్ర గాయాల‌య్యాయి. 

గాయ‌ప‌డిన వారిలో అంద‌రూ 18 నుంచి 40 ఏండ్ల మ‌ధ్య వ‌య‌సువారే ఉన్నారు. క్ష‌త‌గాత్రులంద‌రూ భోపాల్‌లోని హ‌మిదియా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. పాల‌లో ఫ్యాట్‌ను చెక్ చేయ‌డం కోసం తెచ్చిన యాసిడ్‌నే నిందితులు జ‌నంపై చ‌ల్లిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుల‌పై ఇండియ‌న్ పీన‌ల్ కోడ్‌లోని సెక్ష‌న్ 326 కింద కేసు న‌మోదు చేశారు.        

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo