సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Jul 02, 2020 , 13:32:41

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై ఈడీ కేసు

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై ఈడీ కేసు

హైదరాబాద్‌: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసు నమోదుచేసింది. ఆయనతోపాటు మరో ఇద్దరు టీవీ9 మాతృసంస్థ అయిన ఏబీసీఎల్‌ నుంచి 2018-19 మధ్య కాలంలో రూ.18 కోట్లు అనుమతి లేకుండా ఉపసంహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఆ సంస్థ ప్రతినిథులు గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్టోబర్‌లో పోలీసులు కేసు నమోదుచేశారు. దీని ఆధారంగా ఈడీ తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌, ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఈసీఐఆర్‌)ను నమోదు చేసింది. 

ఇదే విషయంలో గత అక్టోబర్‌లో బంజారాహిల్స్‌ పోలీసులు రవిప్రకాశ్‌ను అరెస్టు చేశారు. తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. 


logo