శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Sep 02, 2020 , 14:23:46

హ‌వాలా డీల‌ర్ న‌రేశ్ జైన్ అరెస్ట్‌

హ‌వాలా డీల‌ర్ న‌రేశ్ జైన్ అరెస్ట్‌

ఢిల్లీ : మ‌నీ లాండ‌రింగ్ కేసులో హ‌వాలా డీల‌ర్ న‌రేశ్ జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్‌(ఈడీ) అధికారులు బుధ‌వారం అరెస్టు చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) సెక్షన్ల కింద జైన్‌ను అరెస్టు చేసినట్లు తెలిపిన అధికారులు స్థానిక కోర్టులో హాజరుపర‌చ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ కేసులో 600 బ్యాంకు ఖాతాలతో పాటు రూ 11 వేల కోట్లకు పైగా విదేశీ లావాదేవీలు ఏజెన్సీ స్కానర్ పరిధిలో ఉన్నాయి. ఢిల్లీకి చెందిన వ్యాపార‌వేత్త ఎంతోకాలంనుంచి ద‌ర్యాప్తు ఏజెన్సీల ప‌రిశీల‌న‌లో ఉన్నాడు. ఫారెక్స్ చ‌ట్టాన్ని ఉల్లంఘించాడ‌నే ఆరోప‌ణ‌ల‌తో 2016లో ఈడీ త‌న‌పై రూ.1200 కోట్ల‌కు సంబంధించి నోటీసులు జారీ చేసింది. జైన్ ఎన్నో ఏళ్లుగా హ‌వాలా లావాదేవీల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు ద‌ర్యాప్తు సంస్థ‌లు తెలుపుతున్నాయి. నిషేధిత నెట్‌వ‌ర్క్స్‌ల‌కు ఆర్థిక స‌హాయం చేశాడని గ‌తంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) జైన్‌ను అరెస్టు చేసింది. ఎన్‌సీబీ ఫిర్యాదు ఆధారంగా ఈడీ మ‌నీ లాండ‌రింగ్ కేసును చేప‌ట్టింది. 


logo