శనివారం 08 ఆగస్టు 2020
Crime - Aug 02, 2020 , 16:46:00

తాగుబోతుల చేతిలో వాలంటీర్ హ‌త్య‌

తాగుబోతుల చేతిలో వాలంటీర్ హ‌త్య‌

కోల్‌క‌తా : ప‌శ్చిమ బెంగాల్ రాజ‌ధాని కోల్‌క‌తాలో శ‌నివారం అర్ధ‌రాత్రి దారుణం జ‌రిగింది. విద్యాసాగ‌ర్ బ్రిడ్జికి స‌మీపంలోని ఓ పుణ్య‌క్షేత్రం వ‌ద్ద ముగ్గురు వ్య‌క్తులు మ‌ద్యం సేవిస్తున్నారు. మైదాన్ పోలీసు స్టేష‌న్‌లో వాలంటీర్‌గా ప‌ని చేస్తున్న ఇర్షాద్ హోసేన్ అలియాస్ మ‌హ‌మ్మ‌ద్ స‌న్ని విద్యాసాగ‌ర్ బ్రిడ్జి కింద వెళ్తున్నాడు. తాగుబోతులు క‌నిపించేస‌రికి మ‌ద్యం ఇక్క‌డ ఎందుకు తాగుతున్నార‌ని ప్ర‌శ్నించాడు.

దీంతో మ‌ద్యం బాబుల‌కు, స‌న్నీకి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మ‌ద్యం మ‌త్తులో స‌న్ని త‌ల‌పై ఇటుక‌ల‌తో దాడి చేశారు. స‌న్ని అప‌స్మార‌క‌స్థితిలోకి వెళ్లిపోవ‌డంతో.. మందుబాబులు అక్క‌డ్నుంచి వెళ్లిపోయారు. బాధిత వ్య‌క్తిని గ‌మ‌నించిన స్థానికులు ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘ‌ట‌న‌పై మైదాన్ పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. వాలంటీర్‌ను హ‌త్య చేసిన నిందితుల‌ను అరెస్టు చేశారు.


logo