మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Sep 07, 2020 , 21:52:58

బర్త్‌డే పార్టీలో మ‌ద్యం తాగిపించి.. బ్యుటీషియ‌న్‌పై స్నేహితులు గ్యాంగ్ రేప్‌

బర్త్‌డే పార్టీలో మ‌ద్యం తాగిపించి.. బ్యుటీషియ‌న్‌పై స్నేహితులు గ్యాంగ్ రేప్‌

ప్ర‌యాగ్రాజ్ : ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాష్ర్టం ప్ర‌యాగ్రాజ్‌లో ఓ యువ‌తి‌పై స్నేహితులు గ్యాంగ్ రేప్ చేసిన ఘ‌ట‌న‌ సంచలనం సృష్టించింది. యువ‌తి వృత్తిరీత్యా బ్యుటీషియ‌న్ కాగా మిత్రుడి పుట్టిన‌రోజు పార్టీకి వెళ్లిన‌ప్పుడు ఘ‌ట‌న చోటుచేసుకుంద‌ని పోలీసులు తెలిపారు. 

వివ‌రాలు.. ప్ర‌యాగ్రాజ్‌లోని బెనిగంజ్‌కు చెందిన ఓ 20 ఏండ్ల బ్యుటిషియ‌న్‌ను ఆమె స్నేహితుడు త‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా పార్టీ ఇస్తాన‌ని సులేం సారాయ్ వ‌ద్దనున్నత‌న ఇంటికి శ‌నివారం పిలిచాడు. ఆరోజు రాత్రి స్నేహితులంద‌రూ కేక్ క‌ట్ చేసి, మ‌ద్యం సేవించి ఎంజాయ్ చేశారు. యువ‌తి కూడా ఫూటుగా మ‌ద్యం సేవించ‌డంతో రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో ఆమె స్నేహితుడితో స‌హా కొంత‌మంది యువ‌కులు యువ‌తిపై గ్యాంగ్ రేప్‌కు పాల్ప‌డ్డారు. 

తేరుకున్న త‌రువాత అదేరోజు అర్థ‌రాత్రి పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి యువ‌తి ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం పార్టీ జ‌రిగిన ప్ర‌దేశానికి వెళ్ల‌గా అప్ప‌టికే అంద‌రూ ప‌రార్ అయ్యారు. పార్టీలో ఎంత‌మంది పాల్గొన్నార‌నే విష‌యం తెలియ‌ద‌ని, నిందితుల కోసం వెతుకుతున్నామ‌ని, ఈ కేసులో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క‌రినీ కూడా అరెస్టు చేయ‌లేద‌ని ఆదివారం పోలీసులు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo