ఆదివారం 25 అక్టోబర్ 2020
Crime - Sep 13, 2020 , 20:32:05

డ్రగ్స్ కేసు.. రాగిని, సంజనాల‌కు ఫోరెన్సిక్ ప‌రీక్ష‌లు

డ్రగ్స్ కేసు.. రాగిని, సంజనాల‌కు ఫోరెన్సిక్ ప‌రీక్ష‌లు

బెంగళూరు :  డ్రగ్స్ రాకెట్ కేసులో అరెస్టయిన క‌న్న‌డ‌ నటీమణులు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలకు బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు ఆదివారం ఎఫ్‌ఎస్‌ఎల్‌లో హెయిర్ ఫోలికల్ టెస్ట్‌తో పాటు ఫోరెన్సిక్ ప‌రీక్ష‌లు చేయించారు. వీరిద్ద‌రి పోలీస్ క‌స్ట‌డీ సోమవారం సాయంత్రం ముగుస్తుందని.. అన్ని పరీక్షలు చేయటానికి వారికి ఇంక ఒక్క‌ రోజు మిగిలి ఉండ‌డంతో మాడివాలాలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్‌ఎల్)కు త‌ర‌లించిన‌ట్లు  పేర్కొన్నారు. 

మొద‌ట శాంపిళ్లు ఇవ్వ‌డానికి మొండికేసిన న‌టులు ఆదివారం మాత్రం నిశ్శ‌బ్ధంగా పోలీసుల సూచ‌న‌లు పాటించారు. ఈ సంద‌ర్భంగా పోలీసులు మాట్లాడుతూ మూత్రం, లాలాజలం, రక్త నమూనాల పరీక్షలతో పోలిస్తే హెయిర్ ఫోలికల్ పరీక్ష మంచి ఫలితాలను ఇస్తుంద‌న్నారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo