సోమవారం 18 జనవరి 2021
Crime - Dec 19, 2020 , 15:15:26

ట్రాక్ట‌ర్ బోల్తాప‌డి డ్రైవ‌ర్ మృతి

ట్రాక్ట‌ర్ బోల్తాప‌డి డ్రైవ‌ర్ మృతి

వరంగల్ : ట‌్రాక్ట‌ర్ అదుపుత‌ప్పి బోల్తాప‌డిన దుర్ఘ‌ట‌న‌లో డ్రైవ‌ర్ మృతిచెందాడు. ఈ విషాద సంఘ‌ట‌న వరంగల్ నుండి నర్సంపేటకు వేళ్ళే రహదారిలో శ‌నివారం తెల్ల‌వారుజామున‌ చోటుచేసుకుంది. ఇసుక అన్‌లోడ్ చేసి తిరిగి వెళ్తున్న క్ర‌మంలో డివైడర్‌ని ఢీకొన‌డంతో ఈ ప్ర‌మాదం చోటుచేసుకున్న‌ట్లుగా స‌మాచారం. స‌మాచారం అందుకున్న మిల్స్‌కాల‌నీ పోలీసులు ప్ర‌మాద‌స్థ‌లాన్ని ప‌రిశీలించారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం మార్చరికి తరలించారు.